NANDI TIMES

'పేస్'లో 3 నుంచి రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు


ఒంగోలు: స్థానిక పేస్ ఇంజ నీరింగ్ కళాశాలలో 24వ రాష్ట్రస్థాయి పాలిటెక్నిక్ క్రీడా పోటీలు ఫిబ్రవరి 3 నుంచి 5వతేదీ వరకు నిర్వహిం చనున్నారు. ఈ విషయాన్ని కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ మద్దిశెట్టి శ్రీధర్ తెలిపారు. పోటీల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఆయన తెలిపారు. స్థానిక పేస్ ఇంజనీరింగ్ కళాశాలలో బుధ వారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పోటీలకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. 13 జిల్లాల నుంచి 2500 మంది క్రీడాకారులు, 200 మంది అధికారులు, క్రీడా పోటీలకు హాజరు కానున్నారని అంచనా వేశారు. క్రీడాపోటీలు నిర్వహణకు ప్రకాశం జిల్లాతోపాటు, నెల్లూరు, కడప జిల్లా పీడీలను కూడా నియమించినట్టు ఆయన చెప్పారు. మూడు రోజులపాటు జరగనున్న క్రీడా పోటీల్లో పాల్గొనున్న క్రీడాకారులకు, అధికారులు అందరికి కళాశాలలోనే భోజన, వసతి సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నట్టు మద్దిశెట్టి శ్రీధర్ తెలి పారు. 3వతేదీ సాయంత్రం సాంస్కృతిక కార్యక్ర మాలు, 4న క్యాంప్ పైర్ నిర్వహించనున్నట్టు ఆయన తెలి పారు. బాల, బాలికలకు వేర్వేరుగా పోటీలు నిర్వహిస్తామన్నారు.